728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2020

చిలకలూరిపేట క్వారంటైన్ సెంటర్ లో పనిచేసే ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్

చిలకలూరిపేట: 
🔶 కరోనా పాజిటివ్ వచ్చిందంటే వారిని క్వారంటైన్ కు పంపిస్తారు. కానీ ఇక్కడ విచిత్రమేమంటే చిలకలూరిపేట క్వారంటైన్ లో పనిచేసే సిబ్బంది ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది.

🔶 చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నంలోని ఒక సచివాలయంలో ఒక యువకుడు(39) అడ్మిన్ గా పని చేస్తున్నాడు. అలానే పోలిరెడ్డి పాలెంలోని ఒక సచివాలయంలో ఒక యువకుడు(26) శానిటరీ సూపర్వైజర్ గా పని చేస్తున్నారు.

🔶 వీరిరువురు పట్టణంలోని టిడ్కో గృహాల్లో ఉన్న క్వారంటైన్ సెంటర్లో విధుల్లో భాగంగా పని చేస్తున్నారు.

🔶 అయితే పురుషోత్తపట్నం సచివాలయంలో ఉద్యోగి కృష్ణ మహల్ సెంటర్ లో నివసిస్తున్నాడు. పోలి రెడ్డిపాలెం సచివాలయంలో పనిచేసే ఉద్యోగి బల్లికురవ నుండి వస్తూ పోతూ ఉంటాడు.

🔶 వీరిరువురు గత రెండు నెలల నుంచి టిడ్కో గృహాల్లో ఉన్న క్వారంటైన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు.

🔶 వీరువురికి కరోనా పాజిటివ్ రావడంతో వీరు అదే క్వారంటైన్ సెంటర్లో చికిత్స నిమిత్తం ఉండవలసి వచ్చింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట క్వారంటైన్ సెంటర్ లో పనిచేసే ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE