చిలకలూరిపేట: పట్టణంలోని పండరీపురంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు వ్యక్తి మార్టూరులోని ఒక బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నాడు. మరియు పట్టణంలోని గాంధీ పేటలో నలుగురు వ్యక్తులకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ నలుగురి రిపోర్టులు అధికారికంగా అధికారులు ప్రకటించలేదు. ఈరోజు పట్టణంలో కరోనా వచ్చిన ఐదుగురు క్వారెంటైన్ సెంటర్ కు వెళ్లారు.
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో నాదెండ్ల మండలంలో 2, ఎడ్లపాడు మండలంలో 22, చిలకలూరిపేట మండలంలో మూడు, చిలకలూరిపేట పట్టణంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా నేడు నియోజకవర్గంలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి.