728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 27, 2020

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్

అమరావతి:
★ ప్రభుత్వాలు మారగానే ప్రత్యర్ధుల పై ఇష్టం వచ్చినట్టు చెయ్యటానికి వీలు ఉండకుండా ఒప్పందాలు, చట్టాలు, న్యాయాలు ఉంటాయి.

★ ఇవే కనుక లేకపోతే రిలయన్స్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, లేక మరో పెద్ద పెద్ద పేరు ఉన్న సంస్థలు ఎప్పుడో, ఎదో ఒక పార్టీకి బలి అయిపోయేవి.

★ మన దేశం ఎప్పుడో నాశనం అయ్యేది.

★ సహజంగా అభివృద్ధి చెందే కంపెనీలు, నాలుగు ఉద్యోగులు వచ్చే కంపెనీలు ప్రభుత్వాలు వదులుకోవు.

★ ఈ కాలంలో ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే ఎంతో కష్టపడి రాయతీలు ఇస్తే కానీ రాని పరిస్థితి.

★ అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కంపెనీలు రావటం చూసి ఏడాది అయ్యింది.

★ అయితే ఇప్పటికే ఉన్న కంపెనీలను కూడా బయటకు పంపించే చర్యలు చేస్తున్నారు.

★ ఇదంతా ఇప్పుడెందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ కు గతంలో ఇచ్చిన కొంత భూమిని వెనక్కు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

★ గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో 483 ఎకరాలు ఇవ్వగా, అందులోని 253 ఎకరాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.

★ అయితే దీని పై అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ హైకోర్టుకు వెళ్ళింది.

★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూములు వెనక్కు తీసుకునే అధికారం లేదని, ఆ భూములు తమకు, ఏపీఐఐసీకి మధ్య జరిగిన ఒప్పందం అని, దీంట్లో ఏపి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కోర్టులో తెలిపారు.

★ అలాగే ఇప్పటికే అక్కడ 2700 కోట్ల పనులు చేపట్టామని, 6 వేల మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారని, ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకుంటూ చెప్తున్న కారణంలో వాస్తవం లేదని అన్నారు.

★ అందుకే జీవోని సస్పెండ్ చెయ్యాలని తమ పిటిషన్ లో కోరారు.

★ ఈ కేసుపై ఈ రోజు విచారణ చేసిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్​ 30న ఇచ్చిన 33వ జీవోని నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.

★ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఆ భూములు వెనక్కు తీసుకునే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ Rating: 5 Reviewed By: NEWS UPDATE