728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 27, 2020

చిలకలూరిపేట: కరోనాను ఎలా జయించారో తెలిపిన రూరల్ సీ.ఐ సుబ్బారావు

చిలకలూరిపేట: కరోనా పాజిటివ్ వచ్చినవారి మనో ధైర్యంగా ఎలా ఉండాలి, కరోనా సోకినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఇంకొన్ని అంశాలు రూరల్ సిఐ సుబ్బారావు  తెలిపారు.

గత నెల 28వ తేదీన రూరల్ సీఐ సుబ్బారావు, వారి కుటుంబ సభ్యులు కరోనా  బారిన పడ్డారు. అయితే తాము ధైర్యంతో కరోనాని జయించి వచ్చామని సీఐ సుబ్బారావు తెలిపారు.

ఈరోజు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఛార్జ్ తీసుకున్న ఆయన 24X7 న్యూస్ అప్డేట్ తో మాట్లాడారు. భౌతిక దూరం తప్పనిసరని, మాస్కు ధరించాలన్నారు. చాలా మంది భయపడే ప్రాణాలు కోల్పోతున్నారని, భయపడకపోతే ఇది ఒక సీజనల్ వ్యాధి లాగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కరోనాను ఎలా జయించారో తెలిపిన రూరల్ సీ.ఐ సుబ్బారావు Rating: 5 Reviewed By: NEWS UPDATE