చిలకలూరిపేట: నియోజకవర్గంలో 167 మందికి గాను రూ.30లక్షల నగదు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైంది. సంబంధిత చెక్కులను ఎమ్మెల్యే విడదల రజిని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటున్నదన్నారు. కరోనా లాంటి విపత్తు సమయంలో సమర్థవంతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారని తెలిపారు. వైఎస్ జగనన్న చేస్తున్న మంచి పనులకు మనమంతా ఏమిచ్చినా రుణం తీరదన్నారు. ఆయనకు కృతజ్ఞులుగా ఎప్పటికి ఉండిపోవాలని కోరారు. అత్యధికంగా చిలకలూరిపేట పట్టణం మూడో వార్డుకు చెందిన తియ్యగూర నిర్మలకు రూ.లక్ష, రామిశెట్టి అచ్చయ్యకు రూ.95వేలు, నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మిడిదొడ్డి అశోక్‌కుమార్‌కు రూ.70వేలు, ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన బాపతు పవన్ కళ్యాణ్ రెడ్డికి 55వేలు, చొప్పున ఆర్థిక సాయం మంజూరైందన్నారు. యడ్లపాడుకు చెందిన దుగ్గినపల్లి మరియదాసుకు సీఎం సహాయనిధి కింద వైద్యం చేయించుకునేందుకుగానే ముందుగా రూ.1.3 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఏదైనా ఆపద వస్తే సీఎం వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నాడనే ధైర్యం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఇలాంటి గొప్ప నాయకత్వంలో తాను భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉందని చెప్పారు.
July 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

