చిలకలూరిపేట: పట్టణంలోని పాటి మీద పుట్ట వారి వీధిలో చంద్రశేఖర్ (39) అనే యువకుడు ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందాడు. ఆ యువకుడు పట్టణంలోని ఓ కిరాణా షాప్ లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. గత నాలుగు రోజుల నుండి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. రాత్రి నుంచి ఊపిరాడక బాధపడుతూ దగ్గి దగ్గి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అతను మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే కరోనా లక్షణాలు ఉండి మృతి చెందాడని వారి కుటుంబ సభ్యులు ఎవరు మృతదేహం వద్దకు వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించగా వారు ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి ఖననం చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
అనేక మంది కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఇళ్లలోనే ఉండి పరీక్షలు చేయించుకోకుండా చికిత్స పొందకుండా భయంతోనే మృతి చెందుతున్నారు. కరోనా అనేది ఒక సాధారణ జలుబు దగ్గు జ్వరం లాంటి వ్యాధి అని దీనికి భయపడాల్సిన పని లేదని చికిత్స తీసుకుంటే నయం అవుతుందని వైద్యులు చెబుతూనే ఉన్నా అనేక మంది భయంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు.