728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 25, 2020

రాత్రి 9 వరకు తెరిచే ఉంచడం.. మద్యపాన నిషేధంలో భాగమేనా?: నారా లోకేష్

అమరావతి:
★ రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని.

★ క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు లేవు అని నారా లోకేశ్ మండిపడ్డారు.

★ కనీసం సరైన భోజనం లేదంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

★ ఇలాంటి సమయంలో జేటాక్స్ వసూళ్ల కోసం జగన్ పరితపిస్తున్నారన్నారు.

★ కరోనా కారణంగా రోడ్ల మీదే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో జేటాక్స్ వసూళ్ల కోసం జగన్ పరితపిస్తుండటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

★ మద్యం దుకాణాలను రాత్రి 9 గంటల వరకూ తెరిచి ఉంచాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు.

★ ఇప్పుడు అమ్మకాల సమయం పెంచడం కూడా మద్యపాన నిషేధంలో భాగమేనా అని.. నిలదీశారు.

★ అకౌంట్స్ కోసం మరో గంట అదనం అంటూ మద్యం దుకాణాలు తెరవటం జగన్ మార్క్ డ్రామా అని విమర్శించారు.

★ మద్యపాన నిషేధం అంటూ మహిళల్ని మోసం చేశారని, ఇప్పుడు అమ్మకాల సమయం పెంచి రాష్ట్రంలో ప్రజల్ని చంపేస్తారా అని లోకేశ్ ప్రశ్నించారు.

★ ఇక నుంచి కరోనా మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయ్యాలని డిమాండ్ చేశారు.

★ మద్యం దుకాణాల దగ్గర కుమ్ములాటలు, కనీస జాగ్రత్తలు కూడా లేకుండా జరుగుతున్న అమ్మకాల వలనే రాష్ట్రంలో కేసులు వేల సంఖ్యలో వస్తున్నాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాత్రి 9 వరకు తెరిచే ఉంచడం.. మద్యపాన నిషేధంలో భాగమేనా?: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE