చిలకలూరిపేట: పట్టణంలో అక్రమంగా మద్యం తెలంగాణ నుండి తెచ్చి గత కొన్ని రోజులుగా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. చిలకలూరిపేట పట్టణంలోని శాంతి నగర్ కు చెందిన ఆరుగురు యువకులు ఆ చుట్టుపక్కల ప్రాంతం లో ఒక వ్యక్తి అక్రమ మద్యం, గుట్కా రవాణా చేసి లక్ష రూపాయలు సంపాదించాడని తాము కూడా ఈ అక్రమ వ్యాపారం చేద్దామని తలిచారు. వెంటనే ఒక అశోక్ లేలాండ్ ఆటో మాట్లాడుకుని మంచినీటి రమ్ములు తీసుకొని కుడితి పోసి తెలంగాణ నుండి మద్యం తేస్తున్నారు.
♦️ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు వలపన్ని వారి వద్ద నుండి 390 మద్యం బాటిళ్లను పట్టుకొని నలుగురు యువకులను అరెస్టు చేశారు. అనంతరం ఆటో ను కూడా సీజ్ చేసినట్లు సిఐ నయనతార మీడియాకు తెలిపారు.
♦️ఏది ఏమైనప్పటికీ చిలకలూరిపేటలో మద్యం ఏరులై పారుతున్న, పట్టీపట్టనట్లు ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎట్టకేలకు 390 మద్యం బాటిళ్లను పట్టుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. పురుషోత్తపట్నం చివరన ఒక వ్యక్తి గత కొంత కాలం నుండి అక్రమ మద్యం, పాన్ పరాగ్ తెచ్చి అమ్ముతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన మిన్నకుండుటపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.