చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో కరోనా కాటుకు మరో వృద్ధుడు(75) బలయ్యాడు. సాతులూరు గ్రామంలో ఒక వృద్ధుడు గత నాలుగు రోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో నరసరావుపేట మహాత్మా గాంధీ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నాడు. అనంతరం పాజిటివ్ రావడంతో అతను గుంటూరు జిజిహెచ్ కు వెళ్లి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు తెలిసింది. అదే ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
సాతులూరు గ్రామాన్ని కరోనా వెంటాడుతుంది. ఆ గ్రామంలో ఇప్పటి వరకు 18 మందికి కరోనా పాజిటివ్ రాగా ఇప్పటికీ ఆ గ్రామంలో ఈ మరణంతో కలిపి ముగ్గురు మృతి చెందారు. సాతులూరు నుండి తెలంగాణ వెళ్లి అక్కడ పరీక్షలు నిర్వహించుకుని పాజిటివ్ రాగా గుంటూరు జిజిహెచ్ వద్ద వెళ్లగానే అతను మృతి చెందిన విషయం విధితమే. చందవరం గ్రామంలో ఇరువురు వ్యక్తులు మృతి చెందారు. మొత్తంమీద నాదెండ్ల మండలంలో కరోనా కాటుకు ఆరుగురు బలయ్యారు.