అయితే చిలకలూరిపేట పట్టణంలోని శాంతి నగర్ కు చెందిన ఆరుగురు యువకులు అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి చిలకలూరిపేట లో అమ్మి అధిక లాభాలు గడిస్తున్నారు. పూర్తి వివరాల ప్రకారం పట్టణంలోని పురుషోత్తపట్నం పక్కనే ఉన్న శాంతినగర్కు చెందిన ఆరుగురు యువకులు 6153 నెంబర్ గల అశోక్ లైలాండ్ ఆటోలో 10 రమ్ముల్లో కుడితి నీళ్లు పోసి ప్లాస్టిక్ కవర్ లో మద్యం బాటిళ్లు పెట్టి రమ్ముల్లో పెట్టి ఆటోలో చిలకలూరిపేటకు తీసుకొస్తున్నారు. ఆటోలో సుమారుగా 2000 మద్యం బాటిళ్లు ఓల్డ్ అడ్మిరల్ , మ్యాన్షన్ హౌస్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఆటోను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ మద్యం తీసుకు వచ్చిన వారిని పట్టుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎస్సై భాస్కర్ తరలించారు. ఈ మధ్య విలువ తెలంగాణలో సుమారుగా రెండు లక్షల 70 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ మద్యం చిలకలూరిపేటలో సుమారు 8 లక్షల రూపాయల వరకు విక్రయించ్చవచ్చు అని తెలుస్తుంది. అయితే వారం క్రితం మారిశెట్టి రామాంజనేయులు అనే వ్యక్తి ఒక ఫైనాన్స్ ఆఫీస్ నుండి ఆటో తీసుకొని అక్రమార్కులకు మద్యం విక్రయానికి ఆటో పెట్టినట్టు సమాచారం. అయితే ఈ ఆటలో సురేష్ అనే వ్యక్తిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
