చిలకలూరిపేట:
♦️నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నెలల నుండి కరోనా కేసుల ఉధృతి నామమాత్రంగా వున్నా, కరోనా కేసులు గత కొద్ది రోజులుగా అతి వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
♦️పట్టణంలో ఇప్పటివరకు 25 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఎడ్లపాడులో ఏడు కరోనా కేసులు, నాదెండ్లలో 8 కరోనా పాజిటివ్ కేసులు, చిలకలూరిపేట మండలంలో ఒక కేసు నమోదు కాగా, మొత్తంమీద చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 41 కరోనా కేసులు నమోదయ్యాయి.
♦️మొదట నియోజకవర్గ పరిధిలోఈ కేసులు కేవలం 10 లోపే ఉండగా, గడిచిన కొద్ది రోజుల నుండి ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
♦️గతంలో కంటైన్మెంట్ జోన్ ను 200 మీటర్ల మేర ఏర్పాటు చేసిన అధికారులు, నేడు ఆ వీధి వరకు మాత్రమే కంటైన్మెంట్ జోన్ ను పరిమితం చేయడం, అపార్ట్మెంట్లలో అయితే కేవలం అపార్ట్మెంట్ వరకు మాత్రమే జోన్ పెట్టడం వల్ల కొంత వరకు వెసులుబాటు కలిగింది.
♦️కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో చిలకలూరిపేట పట్టణంలో ఈ వైరస్ ఎంత భయంకరంగా వ్యాపిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
♦️లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పడంతో కొన్ని వ్యాపార సముదాయాలలో జనాలు ఎక్కువగా తిరగటం, కొంతమంది నిబంధనలు పాటించక పోవడం వల్ల ఈ వైరస్ ఉధృతి పెరుగుతుందేమోనని అనేక మంది ఆందోళన చెందుతున్నారు.
♦️అయితే ఇప్పటివరకు ఈ వైరస్ చిలకలూరిపేట ప్రాంతం నుండి కాక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి వల్ల ఎక్కువ మందికి వ్యాపించడం, ఇతర ప్రాంతాల నుంచి రావడం వల్ల కేసులు పెరగడం జరిగింది.
♦️ఇప్పటివరకు కరోనా వల్ల చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పట్టణంలోని ఒక వ్యక్తి చికిత్స పొంది రికోవర్ అయిన నెల తరువాత హార్ట్ ఎటాక్ సమస్యతో గత నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. మొత్తం మీద చూస్తే ఈ వైరస్ వ్యాప్తికి నియోజకవర్గంలోని ఇద్దరు మృతి చెందారు.
♦️చిలకలూరిపేట పట్టణంలోని కొన్ని వ్యాపార సముదాయాల్లో భౌతిక దూరం పాటించకుండా సానిటైజర్లు వాడకుండా ఉంటున్నారని, చిన్న చిన్న ఇరుకు గల షాపుల్లో జనం ఎక్కువ మంది లేకుండా, రద్దీగా ఉండే ఫాన్సీ షాపుల్లో జనం ఎక్కువగా ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.