చిలకలూరిపేట: విధి నిర్వహణలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కి 50 లక్షల కోవిడ్-19 భీమా ఇన్సూరెన్స్ పాలసీ తక్షణమే అమలు చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ డిమాండ్ చేశారు. సీపీఐ కార్యాలయంలో, మల్లయ్యలింగం భవన్ లో ఆయన మాట్లాడుతూ కరోన బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. అలాగే విధి నిర్వహణలో కరోనా బారిన పడి, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి జర్నలిస్ట్ లకి నెలకి 25 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రతి జర్నలిస్ట్ కి కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి నెలకి 15 వేలు ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు. పెండింగులో ఉన్న వర్కింగ్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టుల ప్రమాద భిమాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుభాని కామ్రేడ్ బాబురావు, వెంకటయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
July 26, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ప్రతి జర్నలిస్ట్ కి 50 లక్షల కోవిడ్-19 భీమా ఇన్సూరెన్స్ పాలసీ తక్షణమే అమలు చేయాలి: సీపీఐ పార్టీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

