చిలకలూరిపేట: పట్టణంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. పట్టణంలో ఏ వీధిలో చూసినా కరోనా కరతాళ నృత్యం చేస్తున్నట్టు ఉంది. పట్టణంలో ఈరోజు ఉదయం ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
పట్టణంలోని రజక కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 300 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 300 మందికి నిర్వహించిన పరీక్షల్లో సుమారు పట్టణంలోని 65 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనితో ఈ ఒక్క రోజే 80 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లయింది. ఈ కేసులతో ఇప్పటి వరకు పట్టణంలో కరోనా కేసుల సంఖ్య 405 కు చేరింది.
పట్టణంలో మున్సిపల్, కోవిడ్ అధికారి ప్రేక్షక పాత్ర వహించడం వల్ల పట్టణంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.