చిలకలూరిపేట: నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో ఒక వ్యక్తి ప్రభుత్వ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా చేస్తున్నాడు. అయితే అతనికి కరోనా పాజిటివ్ రావడమే కాక అదే కుటుంబంలో మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, ఆ కుటుంబంలో ఎనిమిది మందికి కాక ఆ కుటుంబానికి పాలు పోసే వ్యక్తి కూడా కరోనా పాజిటివ్ రావడంతో మొత్తంమీద చందవరం గ్రామంలో ఒక కుటుంబంలో ఎనిమిది మందికి మరియు ఇంకో వ్యక్తి కలిపి తొమ్మిది మంది కరోనా పాజిటివ్ వచ్చింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈరోజు నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో మండలంలో మొత్తం మీద నేడు 13 కరోనా కేసులు నమోదయ్యాయి.
July 30, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా
Rating: 5
Reviewed By: NEWS UPDATE

