728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 30, 2020

సీఎస్ నీలంసాహ్ని పదవీకాలం పొడగించండి - కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ

అమరావతి:
★ ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

★ నీలం సాహ్ని పదవీకాలం జూన్ 30 నాటికి ముగిసింది.

★ ఆమె పదవీకాలాన్ని ఆరునెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరగా.. కేంద్రం మూడు నెలలు పొడిగించింది.

★ కేంద్ర ప్రభుత్వం ఆమోదం ప్రకారం సెప్టెంబర్ 30 తో నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది.

★ ఈ నేపథ్యంలో జగన్ మరోసారి లేఖ రాశారు.

★ నీలం సాహ్ని 1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.

★ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె సుదీర్ఘకాలం పనిచేశారు.

★ నల్గొండ జాయింట్ కలెక్టర్ మచిలీపట్టణం అసిస్టెంట్ కలెక్టర్ గా నీలం సాహ్ని పనిచేశారు.

★ శిశుసంక్షేమ శాఖ పీడీగా , మున్సిపల్ పరిపాలనా విభాగం డిప్యూటీ సెక్రెటరీగా విధులు నిర్వహించారు.

★ 2019 నవంబర్ 13న ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సీఎస్ నీలంసాహ్ని పదవీకాలం పొడగించండి - కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE