728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 21, 2020

కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులు వాడొద్దు

న్యూఢిల్లీ:
★ కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులను ప్రజలు వినియోగించ వద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ హెచ్చరించారు.

★ కరోనా వైరస్‌ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, దీనివల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉందని తెలిపారు.

★ ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాస్తూ... ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సాధారణ మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.

ఎందుకు ధరించొద్దు..?
★ కొవిడ్‌-19 కట్టడికి కవాటాలున్న మాస్క్‌లను వాడడాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి.

★ సాధారణంగా కవాటాలున్న మాస్క్‌లను పారిశ్రామిక ప్రదేశాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే సిబ్బంది ఉపయోగిస్తారు.

★ ఈ కవాటాలు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనిషికి అందిస్తాయి.

★ కానీ, మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపించేస్తాయి.

★ దీంతో వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.

★ ‘‘తప్పనిసరిగా శుభ్రమైన పరిసరాల(స్టెరైల్‌ ఫీల్డ్‌)ను మెయింటెన్ చేయాల్సిన ప్రదేశాల్లో కవాటాలున్న మాస్కులను వాడొద్దు. మనం వదిలేసిన గాలిని అవి నేరుగా అక్కడి వాతావరణంలోకి వదిలేస్తాయి. దీనివల్ల వైరస్‌ కట్టడి కోసం మాస్కులను ధరించాలన్న నిబంధనకు అర్థమే లేకుండా పోతుంది.’’ అని అమెరికా ‘సెంటర్ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’(సీడీసీ) గతంలో ఓ సందర్భంలో పేర్కొంది.

★ ఈ నేపథ్యంలో వస్త్రంతో తయారు చేసిన మాస్కులనే ధరించడం చాలా సురక్షితం అని శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా సహా అమెరికాలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి.

★ ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడాలని గతంలోనే మన ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

★ ప్రతి రోజు మాస్కులను శుభ్రం చేసుకోవాలని, వేడి నేటిలో కనీసం 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని సూచించింది.

★ మాస్కు ముఖాన్ని సరిగ్గా కవర్‌ చేసే విధంగా ఉండాలని.. అలాగే మాస్కుకు ఇరువైపులా ఖాళీలు లేకుండా చూసుకోవాలని కోరింది.

★ అలాగే ఒకరి మాస్కు ఇంకొకరు ధరించకూడదని కూడా పేర్కొంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులు వాడొద్దు Rating: 5 Reviewed By: NEWS UPDATE