728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 11, 2020

బఫెట్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేశ్‌ అంబానీ

న్యూఢిల్లీ:
★ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు.

★ సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టారు.

★ బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు.

★ ఆసియా నుంచి టాప్‌-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్‌ కావడం గమనార్హం.

★ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్‌ ఆ పనిలో విజయవంతమైన సంగతి తెలిసిందే.

★ ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

★ బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాథ‌వే 67.9 బిలియన్‌ డాలర్లను దాటేసింది.

★ ఐతే‌ 2.9 బిలియన్‌ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడంతో బఫెట్‌ తొమ్మిదో స్థానానికి దిగిపోయారు.

★ 2006లోనూ 37 బిలియన్‌ డాలర్లను విరాళం ఇవ్వడంతో ఆయన ర్యాంకు తగ్గిన సంగతి తెలిసిందే.

★ ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగంలో ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

★ రిలయన్స్‌ చమురు రిటైల్‌ వ్యాపారంలో బీపీ పీఎల్‌సీ బిలియన్‌ డాలర్ల వాటా కొనుగోలు చేసింది.

★ మొత్తంగా 2020లో ఎంఅండ్‌ఏ ద్వారా 12శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బఫెట్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేశ్‌ అంబానీ Rating: 5 Reviewed By: NEWS UPDATE