చిలకలూరిపేట: చిలకలూరిపేట పట్టణంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మొట్టమొదటి పాజిటివ్ కేసు శివాలయం వీధి పక్కన ఒక వైద్యురాలి కి సోకి, రికోవర్ అయ్యింది.
మే నెల 25వ తేదీన చిన పెరుసాహెబ్ వీధిలో ఒక మహిళకు పాజిటివ్ వ్యాపించింది. అప్పటి నుండి నేటి వరకు చిన్నపీరుసాహెబ్ వీధిలో మొత్తం మీద ఆ సంఖ్య ఏడుకు చేరింది. ఆ ప్రాంతంలో మొదట 200 మీటర్ల మేర కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేసి, జూన్ నెల 25వ తేదీన ఆ ప్రాంతాన్ని 100 మీటర్ల కంటైన్మెంట్ జోన్ ప్రాంతంగా అధికారులు కుదించారు.
అయితే గత రెండు రోజుల అదే వీధిలో ఒక వ్యక్తికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆ వీధి ఇంకా కొద్ది రోజులు కంటైన్మెంట్ జోన్ గానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
రజక వీధి ఒక మహిళకు పాజిటివ్ నమోదు కావడంతో అక్కడ 28 రోజులకు కంటెంట్మెంట్ జోన్ ను ఏర్పాటు చేసి, అనంతరం ఎటువంటి కేసులు నమోదు కాకపోవడంతో ఆ జోన్ ను ఎత్తివేశారు. అలానే కొద్ది రోజుల క్రితం సుబాని నగర్ ప్రాంతంలో ఒక యువకునికి పాజిటివ్ నమోదు కావడంతో ఆ ప్రాంతంలో కూడా అధికారులు కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు.
ఇటీవల కొద్ది రోజుల క్రితం ఎం.వీనారాయణపురం కాలనీలో పారిశుద్ధ కార్మికునికి పాజిటివ్ నమోదయింది. ఆ ప్రాంతంలో కూడా అధికారులు 100 మీటర్ల మేర కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం లెక్చరర్స్ కాలనీ లో ఒక వ్యక్తి కూడా కరోనా పాజిటివ్ సోకడంతో ఆ ప్రాంతంలో అధికారులు హైపో క్లోరైడ్ సోడియం ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.
35 రోజులకు గాను 11 కోవిడ్ పాజిటివ్ కేసులు, మొత్తం మీద చిలకలూరిపేట పట్టణంలో నేటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా పట్టణం లో ఎన్ని కేసులు నమోదు అవుతాయోనని పుర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.