728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 27, 2020

మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దు: రైతు నాగేశ్వరరావు

చిత్తూరు:
★ తమపై తప్పుడు ప్రచారం చేసి రోడ్డు పాలు చేయొద్దని రైతు నాగేశ్వరరావు చేతులెత్తి వేడుకున్నారు.

★ చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారి వ్యవసాయం చేయించడంపై చలించిపోయిన సోనూసూద్ వాళ్లకు ట్రాక్టర్‌ను కొనిచ్చిన విషయం తెలిసిందే.

★ మంచి మనసు చాటుకున్న సోనూసూద్‌ను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అభినందించి.. రైతు నాగేశ్వరరావు కూతుళ్ల చదువు బాధ్యతల్ని తీసుకున్న విషయం కూడా తెలిసిందే.

★ అయితే ఇలా సాయం చేయడాన్ని ఏపీలోని ఓ పార్టీ, వర్గానికి చెందిన నేతలు జీర్ణించు కోలేకపోయారు. వెంటనే దుష్ప్రచారానికి తెరలేపారు.

★ రైతు నాగేశ్వరరావు నిజంగా పేదవాడు కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

★ దీంతో మనస్థాపం చెందిన రైతు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

★ తన నిజ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే మహల్రాజపురానికి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

★ తన కూతుళ్లను చంద్రబాబు చదివిస్తానని చెప్పడంతోనే తమపై బురదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

★ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని నాగేశ్వరరావు తెలిపారు.

★ తన పేదరికాన్ని గుర్తించి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ మహానుభావుడు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇస్తే ఇలా దుష్ప్రచారం చేయడమేంటని నాగేశ్వరరావు వాపోయారు.

★ దుష్ప్రచారం చేసే వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

★ ఇక ఈ దుష్ప్రచారంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ ఎవరో దయతలిస్తే తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు.

★ పేద రైతుకు సాయం చేయకపోగా ఎవరో అండగా ఉంటే ఓర్చుకోలేకపోతారా? అని ప్రశ్నిస్తున్నారు.

★ ఇలాంటి ప్రచారాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దు: రైతు నాగేశ్వరరావు Rating: 5 Reviewed By: NEWS UPDATE