చిలకలూరిపేట: నియోజకవర్గాన్ని కరోనా వైరస్ చుట్టేస్తుంది. మార్చి 23వ తేదీ నుండి రెండు నెలల వరకు సుమారు పట్టణంలో ఏడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే ఈనెలలో కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. పట్టణంలో ఇప్పటివరకు ఈ నెల 19వ తేదీన రెండు వందల మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా అందులో 53 మందికి కరోనా పాజిటివ్ రావటంతో చిలకలూరిపేటలో ఒకే రోజు అత్యధిక కేసులుగా నమోదయ్యాయి.
అయితే 26వ తేదీన ప్రకటించిన కరోనా పరీక్ష ఫలితాల్లో అత్యధికంగా పట్టణంలో 73 మందికి కరోనా పాజిటివ్ రావటంతో పట్టణంలో ఆరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ చిలకలూరిపేటలో అతివేగంగా విస్తరిస్తూ వ్యాపార లావాదేవీలు, నిత్యఅవసరాల కోసం వెళ్లే జనం, బజార్లలో భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వైరస్ చిలకలూరిపేటలో వేగంగా వ్యాప్తి చెందిందని కొంతమంది భావిస్తున్నారు.
ఇప్పటి వరకు పట్టణంలో సుమారు 242 మందికి కరోనా పాజిటివ్ రాగా చిలకలూరిపేట మండలంలో 50 మందికి, ఎడ్లపాడులో 76 మందికి, నాదెండ్లలో 66 మందికి, నియోజకవర్గం మొత్తం మీద సుమారు 434 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య సుమారు పది వరకు ఉండవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది.