728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2020

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ:
★ కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

★ 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది.

★ అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ‌ అవకాశాన్ని కల్పించింది.

★ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

★ ఈ ఏడాది చివరిలో బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

★ ప్రస్తుత కరోనా కాలంలో ఓటర్లు పెద్ద ఎత్తున లైన్‌లో నిలుచోవడం కరోనా వ్యాప్తి కారణమవుతుందని ఈ సందర్భంగా సీఈసీ అభిప్రాయపడింది.

★ ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసుకునే వీలుంది.

★ కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 65 ఏళ్లుపైబడిన ప్రతి ఒక్కరు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం Rating: 5 Reviewed By: NEWS UPDATE