728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2020

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

చిలకలూరిపేట: కేంద్ర  ప్రభుత్వము కార్మికులకు చేస్తున్న విధానాలకు నిరసనగా  నేడు చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు, AITUC, INTUC ల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో రిక్షా కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం కనీసం పని లేకుండా ఉన్న కార్మికులకు పోషకాహారం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని వారు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సి.ఆర్ మోహన్ రావు, సుభాని, సుబ్బాయమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం రాధాకృష్ణ, సిపిఎం నాయకులు మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా Rating: 5 Reviewed By: NEWS UPDATE