చిలకలూరిపేట మండలం బొప్పుడి పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న వైన్ షాప్ లో ఉదయం 11 గంటల నుండి 7 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అయితే విక్రయాలు జరిగేటప్పుడు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అలానే ఇతర చోట్ల వైన్స్ మూసివేయడంతో అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్లు, సిబ్బంది కూడా ఈ షాపు వద్దనే ఉండి పని చేస్తున్నారు.
అయితే కొసమెరుపేమిటంటే అక్కడ వారు జనం అడిగిన బ్రాండ్ ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇచ్చి పంపడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్వార్టర్ బాటిల్ ఓల్డ్ టావర్ను, మరియు ఓ.ఎ.బి మద్యం క్వార్టరు 180 రూపాయల వరకు పలుకుతుంది. అయితే ఈ రెండు బ్రాండ్లు ఉన్నా, వచ్చిన మందుబాబులకు విక్రయించకుండా రాత్రిపూట ఆ వైన్ షాప్ లో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చుట్టుపక్కల గ్రామాలైన మురికిపూడి, బొప్పూడి, తదితర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు, బెల్ట్ షాపుల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు అతనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు కళ్లుకప్పి ఈ రెండు బ్రాండ్ ల మద్యం సైడ్ చేసి ధనార్జనే ధ్యేయంగా సదరు వ్యక్తులు పనిచేస్తున్నారని మందుబాబులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
