728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 14, 2020

క్వారంటైన్‌ విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు

అమరావతి:
★ ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

★ కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

★ తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

★ గతంలో ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు ప్రాంతంగా నిర్ధారించిన ప్రభుత్వం, ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది.

★ విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.

★ గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

★ విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్ లో ఉన్న వారికి 5వ రోజు, 7 రోజున కోవిడ్ టెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

★ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాలని, 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది.

★ విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

★ వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది.

★ రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్ గా టెస్టులు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

★ 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.

★ రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.

★ తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

★ ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా  ఈ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

★ రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు పరిచి కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సూచనలు జారీ చేసింది.

★ హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికల పై గట్టి నిఘా గుర్తించేందుకు ఏఎన్ఎం లు, గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: క్వారంటైన్‌ విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు Rating: 5 Reviewed By: NEWS UPDATE