చిలకలూరిపేట: పట్టణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రెండు చోట్ల జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టణంలో ని రాగన్నపాలెంలో ఒక కిరాణా షాపులో ఒక యువకుడు తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నట్లు అందిన సమాచారం మేరకు అతని వద్ద నుండి 30 క్వార్టర్ బాటిళ్లను, అలానే కృష్ణ మహల్ వెనుకగల రెడ్ల బజార్ లో ఇంకో యువకుడు వద్ద 38 వాటర్ బాటిల్ ల తెలంగాణ మద్యాన్ని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో...
అలానే చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం వద్ద అర్బన్ పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక బండి నుంచి 12 ఫుల్ మద్యం బాటిళ్లు, రెండు హాఫ్ బాటిళ్లను పట్టణ పోలీసులు పట్టుకొని అతని వద్దనుండి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.