చిలకలూరిపేట: పట్టణంలోని హోల్సేల్ మెడికల్ షాపు బజార్ పక్కగల విశ్వబ్రాహ్మణ వీధిలో ఒక వ్యక్తికి (55) ట్రూ నాట్ టెస్ట్లో కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో నివసిస్తున్న సదరు వ్యక్తి హైదరాబాదు వెళ్లి 30 తేదీన చిలకలూరిపేటకు వచ్చారు. అయితే ఆ వ్యక్తికి ఒళ్ళు నొప్పులు, జ్వరం లక్షణాలు రావడంతో సదరు వ్యక్తి 1వ తేదీన నరసరావుపేట వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.
సదరు టెస్ట్లో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఆ వీధికి వెళ్లి విధిలో బ్లీచింగ్, హైపో క్లోరైడ్ సోడియం పిచికారి చేయించారు.