728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు లో నేడు తాజాగా ఒక కరోనా  పాజిటివ్ కేసు నమోదైంది.

గత నెల 29వ తేదీన ఎడ్లపాడులో  నిర్వహించిన 32మంది కోవిడ్ 19 పరీక్షల్లో ఎడ్లపాడు లోని పైపల్లె లో నివసిస్తున్న ఒక యువకునికి (23)కరోనా  పాజిటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు నిర్ధారించారు.

ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎడ్లపాడు వైద్యులు డాక్టర్ లక్ష్మణ్ నాయక్ ఆ యువకుని వద్ద  సేకరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎడ్లపాడు మండలములో  ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మొదటగా ఎడ్లపాడు ఒకే కుటుంబంలో ముగ్గురికి, రెండవది తిమ్మాపురం లో ఒక మహిళకు, మూడోది ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ అతని భార్య, నాలుగవది ఎడ్లపాడు పై పల్లెకు చెందిన ఒక వ్యక్తిది.  మొత్తంమీద ఎడ్లపాడు లో నేటి పాజిటివ్ తో ఈ సంఖ్య ఏడుకు  చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE