728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 2, 2020

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన యువకులు వీరే

ఎడ్లపాడు: కలకత్తా, చెన్నై జాతీయ రహదారి ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఘటన. కంటైనర్ ను వీరు వెళ్లే కారు ఢీ కొన్న సంఘటనలో మొత్తం 4 చనిపోయారు.

వీళ్ళ ముగ్గురు కూడా చిన్ననాటి స్నేహితులు ఒకళ్ళంటే ఒకరు ప్రాణంగా ఉండే వారు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లే ముగ్గురు మూడు ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఒకరు బెంగళూరులో ఒకరు హైదరాబాద్ లో మరొకరు ముంబైలో... అయితే కరోనా నేపథ్యంలో వర్క్ ఎట్ హోమ్ తో నరసరావుపేటలో ఉన్నారు. మరో వ్యక్తి రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన మరొక మిత్రుడుతో కలిపి విజయవాడ ఆఫీస్ పని మీద వెళ్లేందుకు కారులో చిలకలూరిపేట హైవే రోడ్డు మీదుగా వెళుతుండగా మార్గమధ్యంలో తిమ్మాపురం వద్ద కంటైనర్ లారీని ఢీ కొనడం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు ప్రస్తుతం పనసతోట, శ్రీనివాస నగర్, ప్రకాష్ నగర్ లలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబసభ్యులు, బందువులు, చుట్టుపక్కల వారు శోక సంద్రంలో  మునిగిపోయారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన యువకులు వీరే Rating: 5 Reviewed By: NEWS UPDATE