728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 25, 2020

చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో కరోనా కలకలం... నేడు మూతపడనున్న మున్సిపల్ కార్యాలయం

చిలకలూరిపేట: పట్టణంలో కరోనా రోజురోజుకు కోరలు చాస్తుంది. ఇప్పటివరకూ చిలకలూరిపేట పట్టణంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లాంటి కార్యాలయాలకు వ్యాపించిన కరోనా నేడు చిలకలూరిపేట మున్సిపాలిటీ కు కూడా వ్యాపించింది.

ఈనెల 11వ తేదీన 24x7 NEWS UPDATE లో కోవిడ్ నిబంధనలు పాటించని మున్సిపల్ కార్యాలయం అని వార్త వచ్చిన విషయం విదితమే. మున్సిపల్ కార్యాలయానికి ఎంతో మంది వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. కానీ బయట సానీటైజ్ చేయడం గానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక పోవడంవల్ల చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఒకరు మున్సిపల్ కార్యాలయ అధికారి కింద పనిచేసే వ్యక్తి కాగా, ఇంకొక ఉద్యోగి పురసేవలో పనిచేసే ఉద్యోగి.

చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాలు అందుకోవలసిన అధికారి తాను తీసుకోకుండా తన కింద పనిచేసే అతనికి విజ్ఞాపన పత్రాలు తీసుకోమని చెప్పటం, ఎవరు పడితే వారు వచ్చి ఆయనకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినందువల్ల  తనకు ఈ కరోనా వచ్చినట్లు ఆ ఉద్యోగి వాపొయ్యినట్లు తెలుస్తుంది.

ముగ్గురు వార్డు సచివాలయ కార్యదర్శులకు కరోనా


అలానే పట్టణంలోని మూడు వార్డు సచివాలయ కార్యదర్శిలకు ముగ్గురికి కరోనా  వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనివల్ల 25వ తేదీ  శనివారం చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం క్లోజ్ చేస్తున్నట్లు ఒక అధికారి వార్డు సచివాలయలకు మెసేజ్ పెట్టారు.

ఏది ఏమైనా కనీస జాగ్రత్తలు పాటించని మున్సిపల్ పాలన అధికారి వల్ల పని చేస్తున్న కిందిస్థాయి సిబ్బంది కరోనా వచ్చినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే సదరు అధికారి మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉండి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి కింద స్థాయి మున్సిపల్ సిబ్బంది కూడా వర్క్ ఫ్రొమ్ హోమ్ లో పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని వారు కూడా సదరు అధికారిని అడుగనున్నట్లు తెలుస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో కరోనా కలకలం... నేడు మూతపడనున్న మున్సిపల్ కార్యాలయం Rating: 5 Reviewed By: NEWS UPDATE