గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత నాలుగు రోజుల క్రితం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఈ మహిళకు(40) పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చందవరం గ్రామంలోని మహిళా నివాసం వద్దకు మండల అధికారులు వెళ్లి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి ఆ మహిళను క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు. గతంలో చందవరం గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధుడు మృతి చెందిన విషయం విదితమే. చందవరం గ్రామంలో ఇది మూడవ కరోనా పాజిటివ్ కేసు. మొత్తం మీద నాదెండ్ల మండలంలో ఈ కేసుతో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
July 11, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు తాజాగా మరో కరోనా పాజిటివ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

