చిలకలూరిపేట: రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన సందర్భంగా గతవారంలో ఒక మోస్తరు స్థాయిలో పడినటువంటి వర్షానికి పేదల కాలనీలు స్లమ్ ఏరియాలైన, మధర్ దేరిస్సా కాలనీ, వైఎస్సార్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, సంజీవనగర్, అది ఆంద్రాకాలని, సుగాలి కాలనీ, సుభాని నగర్, రాగన్న పాలెం, వడ్డిపాలెం, రాచమల్లు నగర్, మద్దినగర్, తూర్పు మాలపల్లి, రూత్ డైకెమెన్ నగర్, గుర్రాలచావిడి, నెహ్రు నగర్, రజక కాలనీ, తదితర ఏరియాలలో మున్సిపల్ అధికారులు వెంటనే శానిటేషన్ చేయ్యాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పట్టభద్రుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ అజరుద్దీన్ తెలుగుదేశం పార్టీ తరుపున, డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతవారంలో కురిసిన వర్షానికి నీటి మయమై రోడ్ల మీద తేమ డ్రైనేజీ వాటర్ చెత్తా చెదారం పేరుకపోయిందని వీటన్నింటిని వెంటనే తోలగించి మొత్తం స్లమ్ ఏరియాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా శానిటేషన్ చేసి ప్రజలకు కరోనా రాకుండా చూడాలని ఎక్కడైతే తేమ ప్రదేశాలు ఉంటాయే ఆ పాంత్రాలలో కరోనా వ్యాధి రావడానికి మరియు ఇతర డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు జలుబు దగ్గులాంటి రోగాలు ప్రబలడానికి అవకాశం ఉందన్నారు.
July 14, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మురికి వాడల్లో ప్రత్యేక శానిటేషన్ చేయ్యాలి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

