చిలకలూరిపేట: పట్టణంలో ఈ రోజు మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. పట్టణంలోని మద్దినగర్ లో నివసిస్తున్న ఒక యువకుడు గాంధీ పార్క్ సమీపంలో గల ఒక ఆటోమొబైల్ లో పని చేస్తున్నాడు. అతనికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ యువకుడ్ని చిలకలూరిపేట కోవిడ్ కేర్ సెంటర్కు అధికారులు తరలించారు.
అలానే పట్టణంలోని చీరాల రోడ్ లో ఉన్న గంటలమ్మచెట్టు సమీపంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత నాలుగు రోజుల క్రితం వీరికి అనారోగ్యంగా ఉండటంతో 108 అంబులెన్స్లో గుంటూరు జిజిహెచ్ కు తరలించారు.
ఆరోజు వారిరువురికి కోవిడ్ టెస్ట్లు చేయగా ఇరువురి పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిరువురు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో ఉదయం నుండి ఇప్పటివరకు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది.