ఏలూరు: ఏపీ సీఎం జగన్‌కు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారన్నారు. వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారన్నారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా 13 వందల 64 కోట్లు వసూలు చేసిందన్నారు. ఇప్పటి వరకు 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని రఘురామ కృష్ణరాజు లేఖలో కోరారు.
July 14, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సీఎం జగన్‌కు రఘురామ కృష్ణరాజు లేఖ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

