గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం ఇర్లపాడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా వచ్చినట్లు జిల్లా వైద్య అధికారులు నిర్ధారించారు. గత నాలుగు రోజుల క్రితం నాదెండ్లలో 110 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త మరియు కుటుంబ పెద్దకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ మహిళ చిలకలూరిపేట మండలంలోని ఒక గ్రామంలో శుభకార్యానికి వెళ్ళినట్లు అక్కడ ఆమెకు కరోనా వ్యాపించినట్లు తెలుస్తోంది. మొత్తంమీద నాదెండ్ల మండలంలో ఈ రోజు వరకు 16 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఎడ్లపాడు మండలం:
ఎడ్లపాడు మండలంలో మూడు రోజుల క్రితం పదకొండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విదితమే. అయితే వారికి సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయిన 58 మందికి వైద్యాధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పై పల్లెకు చెందిన ముగ్గురికి, ఎడ్లపాడులోని ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మొత్తం మీద ఎడ్లపాడు మండలంలో ఈ రోజు వరకూ 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.