చిలకలూరిపేట: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. గతంలో పట్టణంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒకటిఅరా కేసులకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు నేడు చిలకలూరిపేటలో వాడవాడలకు విస్తరించాయి. పట్టణంలో ఎటూ చూసినా కేసుల పరంపర కొనసాగుతోంది. ఈ వీధి.. ఆ వీధి అనే తేడా లేదు.. ధనిక పేద బేధం లేదు. ఎవరికైనా సోకుతున్న ఈ వ్యాధితో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు.
కరోనా నివారణలో ముందుండి పోరాడుతున్న వారియర్లు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్య కార్మికులు,జర్నలిస్టులు. వారి జీవితాన్ని, కుటుంబాలను త్వజించి కరోనా నివారణకు పోరాడుతున్నారు. ప్రజలను రక్షించటానికి రోడ్లపైకి, ఆసుపత్రులకు పరిమితమౌతున్నారు. పోలీసుల విషయమే తీసుకుంటే ఇళ్లలకు సైతం వెళ్ల కుండా విధుల్లో నిమగ్నమౌతున్నారు. ప్రజలను అవగాహన కల్పించటానికి గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు.
ఒకవైపు కరోనా వారియర్లు కరోనా నియంత్రణకు సర్వశక్తులు వడ్డి పనిచేస్తుంటే ప్రజల్లో కొరవడిన అవగాహన, నిర్లక్ష్యం వెరసి కరోనా వ్యాప్తికి కారణమౌతుంది. పట్టణంలో ఒకవైపు సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతుంటే మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరగటం, భౌతిక దూరం పాటించకపోవటంతో పాటు కంటైన్మెంట్ జోన్ల నుంచి బారికేడ్లను సైతం దాటి సంచరిస్తున్నారు. ఎవరికి వారు అవసరం లేకున్నా రోడ్లమీదకు రావటంతో పోలీసులకు వారిని కట్టడిచేయటంతో సమయం గడిచిపోతుంది.
ఈ సందర్బంగా ఇదే విషయంపై అర్బన్ సీఐ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రజలు కరోనా వ్యాధివిస్తరణపై అవగాహన కలిగి ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి కుటుంబం, సమాజం, పట్టణ ప్రజలు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ప్రస్తుత సంపూర్ణ లాక్‌డౌన్ సందర్బంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే మాస్కులు లేకుండా, నిబంధనలను అతిక్రమించే తిరిగే వారిపై అపరాధ రుసుం వసూలు చేస్తున్నట్లు తెలిపారు. జనం రోజు ఉదయం పూట బయటకు రాకుండా వారానికి సరిపడా కూరగాయలు, మందులు ఒకేసారి తెచ్చుకోవాలని, ప్రతిరోజు బయట తిరగకుండా ఉండాలని తెలిపారు. ఇకనైనా పట్టణ ప్రజలు జాగ్రత్తగా మసలు కోవాలని కోరారు.