728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 1, 2020

చిలకలూరిపేట: మృతి చెందిన అనంతరం పాజిటివ్... అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువుల్లో ఆందోళన

చిలకలూరిపేట: కరోనా  పాజిటివ్ వచ్చి మృతి చెందిన వారి సంఖ్య పట్టణములో నానాటికీ పెరిగిపోతోంది.  చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణారెడ్డి డొంకలో ఒక వ్యక్తి,  వేలూరు రోడ్ లో ఇంకో వ్యక్తి  మృతి చెందిన అనంతరం కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి.

అలానే పట్టణంలోని గాంధీ పేటకు చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చేరిన నాలుగు గంటల అనంతరం మృతి చెందాడు. సదరు వ్యక్తి అంత్యక్రియల్లో అతి తక్కువ మంది పాల్గొనమని అధికారులు చెప్పినా వినకుండా, మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాల్లో సుమారు 100 మంది వరకు పాల్గొన్నట్లు తెలిసింది.

అలానే పట్టణంలోని బొందిలి పాలెంలో ఇటీవల ఒక మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీరా ఆమె భర్తకు కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో  ఆ మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న సుమారు 200 మంది  చుట్టుపక్కల వారు ఆందోళన చెందుతున్నారు. అయితే మృతి చెందిన ఆ మహిళకు కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానంతో స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఒక వ్యక్తి మృతి చెందినప్పుడు భౌతిక దేహాన్ని ఇళ్ల వద్ద ఎక్కువ సమయం ఉంచుకోకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం దహనసంస్కారాలు చేసినట్లయితే ఈరోజు పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో మృతిచెందిన బంధువులకు టెన్షన్ వాతావరణం తప్పేది... ఇప్పుడు ఆ నాలుగు కుటుంబాల్లో వ్యక్తులకు, బంధువులకు, అంత్యక్రియలకు హాజరైన అందరికీ దిన దిన గండంగా మారింది. వారు కోవిడ్ సోకింది అన్న అనుమానంతో పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మృతి చెందిన మృతదేహాన్ని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నా వారి మాట పెడచెవిన పెట్టడం వలన ఈ రోజు పట్టణంలో అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులు దాపురించాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మృతి చెందిన అనంతరం పాజిటివ్... అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువుల్లో ఆందోళన Rating: 5 Reviewed By: NEWS UPDATE