చిలకలూరిపేట: నియోజకవర్గంలో తెలంగాణ నుండి వస్తున్న అక్రమ మద్యం ఏరులై పారుతుంది. పట్టణంలోని సుగాలి కాలనీలో అర్బన్ పోలీసులు సుమారు రెండు వందల మద్యం బాటిళ్లను పట్టుకున్న విషయం విదితమే. అలానే చిలకలూరిపేట రూరల్ పోలీసులు పట్టణంలోని శాంతి నగర్ కు చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి సుమారు రెండువేల మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. పోలీసులు అక్కడ అక్కడ తెలంగాణ మధ్యాన్ని పట్టుకుంటున్నారు. ఈ విధంగా పట్టణంలో కొంతమంది వ్యక్తులు అక్రమ సంపాదన కోసం తెలంగాణ నుండి మద్యాన్ని తెచ్చి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఎడవల్లి గ్రామంలో గణపవరం, కావూరు గ్రామాల్లో అక్రమ మద్యం పాయింట్లు పెట్టుకుని కొంతమంది అడ్డాగా చేసుకొని పట్టణ పరిసర ప్రాంతాలకు ఈ మద్యాన్ని చేర వేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటికీ పోలీసులు కొంతమేర అక్రమ మద్యం అమ్మకాలను అరికడుతున్నా, కొంతమంది అధిక సంపాదన కోసం తెలంగాణా నుంచి తెచ్చి ఈ మద్యాన్ని వాడవాడలా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.