అమరావతి: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సినీ స్టార్లు, రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా బారినపడ్డారు.
విజయసాయి రెడ్డితో పాటు ఆయన పీఏ కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకు వెళ్లిపోయారు. వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలిసింది.