చిలకలూరిపేట: పట్టణంలోని యాభై రెండు ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాల్లో క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేసారు. ఆ సెంటర్ నేడు కోవిడ్ కేర్ సెంటర్ గా మార్పు చేసి సుమారు ఏడు వందల(700) మంది కరోనా పాజిటివ్ పేషెంట్లుకు చికిత్సను అందిస్తున్నారు. చిలకలూరిపేట పట్టణం లోని యాభై రెండు ఎకరాల్లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్కు ప్రస్తుతం ఐదుగురు డాక్టర్లు, 15 మంది వైద్య(నర్స్) సిబ్బంది, ముగ్గురు తోటీ లు, షిఫ్ట్ కు 10 మంది చొప్పున సానిటరీ సిబ్బంది మాత్రమే ఉన్నారు.
అయితే ఈ సెంటర్ కు రోజుకు 70 నుండి 140 మంది వరకు పాజిటివ్ పేషెంట్లు చేరుతున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో ప్రస్తుతం ఆక్సిజన్ మాత్రమే పేషెంట్లకు ఇవ్వగలుగుతారు. వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల గత రెండు రోజుల క్రితం ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ అంబులెన్స్ లో గుంటూరు వెళ్లారు. అతన్ని ఏ ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు చేర్చుకోకపోవడంతో నానా అవస్థలు పడి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాడు.
అలాగే ఇక్కడ ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, వైఫై కంప్యూటర్ ఏర్పాటు చేయాలని అక్కడ వైద్యులు కోరుతున్నారు. వచ్చేపోయే వారి వివరాలు నమోదు చేసుకోవాలంటే ఇబ్బంది గా ఉందంటున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో శానిటేషన్ సిబ్బంది పది మంది మాత్రమే ఉన్నారని వారు సరిపోవటంలేదని తెలుస్తుంది. ఈ సెంటర్లో ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి వెంటిలేటర్, వైద్య సిబ్బంది నియామకాన్ని పెంచడం, శానిటరీ సిబ్బందిని పెంచడం చేస్తే ఇంకా ఎక్కువ మందికి వైద్య సహాయం అందేలా చేయవచ్చని పలువురు పేషెంట్లు కోరుతున్నారు.
గతంలో 14 రోజులకు కరోనా పేషెంట్లను డిశ్చార్జ్ చేసేవారు. ప్రస్తుతం బెడ్లు, రూమ్లు ఖాళీ లేక పది రోజులకే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. చిలకలూరిపేట, వినుకొండ, నరసరావుపేట పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో రోజుకు 100 నుంచి 150 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు చిలకలూరిపేటలోని 52 ఎకరాల్లో ఉన్న ఈ కోవిడ్ కేర్ చికిత్స కేంద్రానికి వస్తున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అక్కడ వైద్య సిబ్బందిని, వెంటిలేషన్ సౌకర్యాన్ని, శానిటరీ సిబ్బందిని, పెంచేలా చేయాలని జిల్లా అధికారులను ప్రజా ప్రతినిధులను కరోనా పేషెంట్లు తదితరులు కోరుతున్నారు.