దిల్లీ: దేశంలో కరోనా కేసుల అంకంలో మరో రికార్డు నమోదైంది. ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో గత ఒక్కరోజులో 27,114 కేసులు రాగా.. 519 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,20,916కి చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2,83,407 మంది చికిత్స పొందుతుండగా.. 5,15,386 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 22,123 మంది ప్రాణాలు కోల్పోయారు.
July 11, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: దేశంలో భారీగా కొత్త కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

