చిలకలూరిపేట:
🔷 రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం దొరుకుతుందో లేదో తెలియదు కానీ.. చిలకలూరిపేటలో మాత్రం విచ్చలవిడిగా ఏ గల్లిలో చూసిన మద్యం విక్రయాలు బెల్ట్ షాపుల ద్వారా జరగటం పలు విమర్శలకు దారి తీస్తోంది.
🔷 నిన్న మొన్నటి వరకు వైన్ షాపులు తెరవక మందుబాబులు సతమతమవుతూ ఉండగా.. చిలకలూరిపేట మండల పరిధిలో బొప్పూడి జాతీయ రహదారిపై ఒక వైన్ షాపు మాత్రమే తెరిచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఆ షాపులో నుంచి కూడా రాత్రిపూట బెల్టు షాపులకు మద్యం అక్రమంగా తరలిపోతున్న తీరుపై గత కొద్ది రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
🔷 అయితే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఎడ్లపాడు మండలం కొండవీడు కొండపై అధికారులు కొన్ని వేల లీటర్లు నాటు సారా ధ్వంసం చేసినా ఏరోజుకారోజు కొండపై నాటు సారా కాయటంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు కొండవీడు ప్రఖ్యాతిని అపహాస్యం పాలు చేయడానికే జరుగుతున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.
🔷 ఇది ఇలా ఉంటే పట్టణంలోని సుగాలి కాలనీలో ఇటీవల రెండు మూడు సార్లు అక్రమ మద్యం అమ్ముతున్న వారిని ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు కాని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణ నుంచి తెచ్చి విచ్చలవిడిగా అమ్మే ఒక పలుకుబడి కలిగిన వ్యక్తిని మాత్రం కంట్రోల్ చేయలేక పోవడం వెనక మతలబు ఏమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
🔷 పట్టణంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి 7 కాగానే 11 గంటల వరకు తెలంగాణ నుంచి వచ్చిన మద్యం కోసం మందుబాబులు గల్లి గల్లి తిరిగి మద్యం బాటిల్ అధిక ధరకు కొంటున్నారు. ఒక రకంగా చూస్తే మందుబాబులు ఇతర రాష్ట్రాల మద్యం తాగటము వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు గండి పడేలా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల చర్యలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
🔷 ఏది ఏమైనా తెలంగాణ నుండి వస్తున్న మధ్యాన్ని అరికట్టడంలో చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.