చిలకలూరిపేట: పట్టణంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో డంప్ అయి ఉన్న ఇసుక భవన నిర్మాణాలకు ఆన్లైను ద్వారా ఇవ్వడానికి లైన్ క్లియర్ అయింది. గత మూడు రోజుల నుండి నియోజకవర్గ స్థాయిలో ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక ఇసుక ట్రాక్టర్ కు నాలుగున్నర టన్నులకు 4,394 రూపాయలకు, అలానే ఆరు టైలర్ లారీకు పది టన్నుల మేర ఇసుకను 9,966 రూపాయలు, 10 టైర్ల లారీకు 18 టన్నుల ఇసుక లారీకు 17,203 రూపాయల చొప్పున ప్రభుత్వం తరఫున మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వం డెలివరీ చేపిస్తుంది.
అయితే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో గ్రామ, వార్డు సచివాలయం ద్వారా వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. వారు బుక్ చేసుకున్న 72 గంటల లోపు ఈ యొక్క మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక డెలివరీ అవుతుంది. ఒక ట్రాక్టర్ ఇసుకకి వచ్చేసరికి 1687.50 రూపాయల ధర నిర్ణయించగా, డిపో నుంచి ఇక్కడికి తీసుకు రావడానికి 1,327.50. అలానే డోర్ డెలివరీ చేయడానికి 1,378. దీని ప్రకారం నాలుగున్నర టన్నుల ఇసుక ట్రాక్టర్ కు 4,394 రూపాయలుగా నిర్ణయించారు.
అయితే ఒక పరిధి వరకు ఈ యొక్క రేట్లను ప్రభుత్వం నిర్ణయించింది. పరిమిత కిలోమీటర్లు దాటిన తర్వాత అదనపు ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్లో 10వ తేదీ నుండి ఈరోజు వరకు సుమారు 54 మంది చిలకలూరిపేటలో ఇసుకను పొందినట్లు సిబ్బంది తెలియజేశారు. అయితే ఆన్లైన్లో కొన్నిసార్లు ట్రాక్టర్ ఆప్షన్ ఉన్నచోట పది టన్నుల ఇసుక లారీ ఆప్షన్ రావడంతో కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది. మొత్తంమీద భవన నిర్మాణ కార్మికులకు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇసుక అందుబాటులోకి రావడం చాలా వరకు సంతోషించదగ్గ విషయమే.