తెలంగాణ: మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు KT రామారావు, ఈటల రాజేందర్,శ్రీనివాస్ గౌడ్ లు దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత చెట్లను నాటారు. KCR ఎకో అర్బన్ పార్క్ లో చైన్ లింక్ ఫెన్సింగ్ తో పాటు ఇతర 155.60 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రులు KT రామారావు గారు, ఈటల రాజేందర్,V. శ్రీనివాస్ గౌడ్ లు ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు అనతికాలంలోనే రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచినందుకు మంత్రులు సంతోషం వ్యక్తంచేశారు.