728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 19, 2020

ప్రజా శ్రేయస్సే ధ్యేయం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

ప్రజా సంక్షేమమే ప్రథమ ధ్యేయమని నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో ఎంపీ తరుఫున మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌  చెక్‌లకు ఆదివారం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లబ్ధిదారులకు అందించారు. మొత్తం 19మందికి గాను రూ.4,28,000 విలువ చేసే చెక్‌లను నిరుపేదలకు ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలను అమలు చేస్తుందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ కొరత లేకుండా సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా సంక్షేమ ఫలాలు అందిస్తూ.. పాలనలో సరికొత్త ఒరవడిని తేస్తున్నరని కొనియాడారు. వైద్యం ఖర్చు నిమిత్తం నిరుపేదలకు మంజురైన సీఎం ఫండ్‌  చెక్‌లు అందించటం ఆనందంగా  ఉందన్నారు. ఈ సొమ్ము నిరుపేదలకు ఈ విపత్కర పరిస్థితుల్లో ఆసరాగా ఉంటుందన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి క్షేమంగా ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రజా శ్రేయస్సే ధ్యేయం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు Rating: 5 Reviewed By: NEWS UPDATE