728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 16, 2020

చిలకలూరిపేట సండ్రీ వసూళ్లలో గోల్మాల్... ఆ రసీదులు మున్సిపాలిటీవేనా⁉️

చిలకలూరిపేట: మున్సిపాలిటీ సండ్రీ వసూల్ గోల్మాల్ జరుగుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి నెలతో సండ్రీ వసూల్ పాట టైం  అయిపోవడంతో మున్సిపల్ కార్యాలయం వారు కరోనా కారణంగా సండ్రీ వేలం పాటను అర్ధాంతరంగా నిలిపివేశారు.

అయితే గత నెల 23వ తేదీన ఆర్ఓసీ నెంబర్ 564 /20 20/ఏ2 ప్రకారం టెండర్లు పిలిచారు. దీని ప్రకారం గత నెల 30 తేదీన మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి సమక్షంలో వేలం పాటను ప్రారంభించారు. మొదటగా మాంసం, చేపలు వేలం పాటను 1,55,000 వేల రూపాయలు ఒక వ్యక్తి పాడుకున్నాడు. అనంతరం మార్కెట్టు, సండ్రీ పాటలు నిర్వహించాల్సి ఉండగా అర్ధాంతరంగా పాటను నిలుపుదల చేస్తున్నట్లు రెవెన్యూ అధికారి ప్రకటించి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే... మున్సిపల్ కార్యాలయం తరఫున పట్టణంలో మార్కెట్, సండ్రీ, మాంసం చేపల అమ్మకందారుల వసూళ్లు మున్సిపల్ కార్యాలయం తరఫున నలుగురు వసూలు చేస్తూ ఉన్నారు.

సుమారుగా రోజుకు నాలుగు వేల ఆదాయం మాత్రమే మున్సిపాలిటీకి తేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే మున్సిపల్ కార్యాలయం నిబంధనల ప్రకారం ఒక లారీకు వంద రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. తోపుడు బండికి పది రూపాయలు మాత్రమే వసూలు చేయాలి.

కానీ ఈరోజు పట్టణంలోని బోస్ రోడ్ లో సీరియల్ నెంబర్ 49 రసీదు ప్రకారం 2019-20 మున్సిపల్ సండ్రీ వసూలు దీ.16-7-2020 తారీకుతో AP 07 TA 9389 లారీ డ్రైవర్ కు 300 రూపాయలు రసీదు ఇచ్చి, 150 రూపాయలు మాత్రమే పట్టుకెళ్లారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం వంద రూపాయలు వసూలు చేయాల్సిన ఉండగా 300 రూపాయల రసీదులు ముద్రించి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఎందుకలా 150 వసూలు చేస్తున్నారని ఒక ప్రశ్న.


రెండవది మున్సిపల్ కార్యాలయం వారు ఇలా సండ్రీ వసూలు చేస్తుంటే 2019-20 సంవత్సరంలో రసీదు ఎందుకు ఉపయోగిస్తారు అనేది రెండో ప్రశ్న. మూడవది మున్సిపల్ కార్యాలయం వారు ఇలా చేస్తున్నారా? లేక బయట వ్యక్తులు రసీదులు ముద్రించి డబ్బు వసూలు చేస్తూ మున్సిపల్ అధికారులను మోసం చేస్తున్నారా ఇది మూడో ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు అధికారులు జవాబు ఇవ్వవలసి ఉంది.

ఒకవేళ మున్సిపల్ సిబ్బంది ఇలా చేస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.  లేదా బయట వ్యక్తులు ఇలా చేసి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిఫార్సు  చేయవలసి ఉంది. ఇప్పుడు పురప్రజలకు తెలుస్తున్న విషయం ఏమిటంటే... గత నెల 30వ తేదీన జరిగే వేలం పాటను అర్ధాంతరంగా నిలిపివేయడంతో ఇటువంటి మోసాలు జరిగుతున్నాయని, అధికారులు ఎందుకు ఈ  పాటను రద్దు చేశారో నేటికీ అంతుచిక్కలేదు. సరే కరోనా ఉందంటే... మరి ఇప్పుడు వసూలు చేసే వారికి కరోనా వల్ల ఇబ్బంది రాదా అనేది కూడా ఒక ప్రస్నే.

ఈ విషయంపై చిలకలూరిపేట పురపాలక సంఘం కమిషనర్ కు వివరణ కోరగా ఎంత వసూలు చేయాలనేది గజిట్  చూసి చెబుతామని పూర్తి వివరాలు తనకు తెలియవని గజిట్ చూసి వివరణ ఇస్తామని తెలిపారు. ఏమైనా  అవకతవకలు జరిగితే వెంటనే విచారణ చేపడతామని కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట సండ్రీ వసూళ్లలో గోల్మాల్... ఆ రసీదులు మున్సిపాలిటీవేనా⁉️ Rating: 5 Reviewed By: NEWS UPDATE