728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 8, 2020

మ‌హాత్ముల‌కు మ‌ర‌ణం ఉండ‌దు: ఎమ్మెల్యే రజిని

చిలకలూరిపేట: వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా బుధ‌వారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ పేద‌ల గుండెల్లో కొలువై ఉన్న నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని కొనియాడారు. ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ, జ‌ల‌య‌జ్ఞం,పేద‌ల‌కు ఇళ్లు, 108 వాహ‌నాలు, వ‌డ్డీలేని రుణాలు.. ఇలా ఎన్నో ప‌థ‌కాలు వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలిపారు. ఆ త‌ర్వాతి ప్ర‌భుత్వాలు కూడా ఇవే ప‌థ‌కాల‌ను కొన‌సాగించాల్సిన ప‌రిస్థితులు నెల‌కొనేలా చేశార‌ని చెప్పారు. ఆయ‌న ప‌రిపాల‌న ఈ దేశానికే ఆద‌ర్శ‌మ‌న్నారు. నిరుపేద‌ల‌ను ప్ర‌భుత్వాలు ఎలా ఆదుకోవాలో ప్ర‌పంచానికి చూపిన గొప్ప దార్శినికుడు వైఎస్సార్ అని ప్ర‌శంసించారు. త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా తండ్రి బాట‌లోనే ప‌య‌నిస్తూ గొప్ప ప‌రిపాల‌న అందిస్తున్నార‌ని కొనియాడారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మ‌హాత్ముల‌కు మ‌ర‌ణం ఉండ‌దు: ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE