728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 8, 2020

మ‌ర‌ణం లేని మ‌హానేత వైఎస్సార్‌: సీఎం జ‌గ‌న్

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ ఇడుపులపాయలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇడుపులపాయ నుంచి ట్వీట్ చేశారు. ఇవాళ నాన్న గారి 71వ జయంతి... ఆయన మరణంలేని మహానేత అంటూ కీర్తించారు. ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిలా నిలిచిపోతారని కొనియాడారు. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఇడుపులపాయ వచ్చిన సందర్భంగా సీఎం జగన్ ఇక్కడి ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ క్లాస్ రూములను, విద్యుత్ వ్యయాన్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ శిలాఫలకాలను కూడా ఆవిష్కరించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మ‌ర‌ణం లేని మ‌హానేత వైఎస్సార్‌: సీఎం జ‌గ‌న్ Rating: 5 Reviewed By: NEWS UPDATE