728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 10, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలోని భావనారుషి నగర్ లో తాజాగా నేడు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  పట్టణంలోని పద్మశాలి పేటలో బంగారం పని చేసే ఒక వ్యక్తికి గత కొద్ది రోజుల క్రితం పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. అయితే అదే బంగారం పని షాప్ లో భావనరుషి నగర్ కు చెందిన తండ్రి కొడుకులు అతని వద్ద పని చేస్తున్నారు.  గత మూడు రోజుల క్రితం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సులో 255 మంది కి కరోనా  టెస్ట్లు  చేసిన విషయం విదితమే. ఈ పరీక్షల్లో  254 మందికి నెగటివ్ ఫలితాలు వచ్చాయని నిన్న రాత్రి అధికారులు తెలిపిన విషయం కూడా తెలిసిందే.

అయితే భావనరుషి నగర్కు చెందిన తండ్రీ(40) కొడుకు (15) ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణంలో శివాలయం వీధి, చిన్న పీరు సాహెబు వీధి, రజక వీధి, ఎం.వీ నారాయణపురం, సి.ఆర్ కాలనీ, తూర్పు మాలపల్లె, వెంకటరెడ్డి నగర్, సుభాని నగర్, కృష్ణ మహల్ బజార్ ప్రాంతాలకు మాత్రమే విస్తరించిన ఈ కరోనా నేడు భావనరుషి నగర్ కు కూడా తాకింది. ఈ రెండు కేసులతో చిలకలూరిపేట పట్టణంలో ఈ కరోనా సంఖ్య 32 కు చేరింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE