చిలకలూరిపేట: పట్టణంలో ఈ రోజు ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని సుభాని నగర్ అపార్ట్మెంట్ లో ఒకరికి, సి.ఆర్ కాలనీ నాలుగో లైన్ లో ఇరువురు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది. అలానే మార్కండేయ నగర్ లో ఒక వ్యక్తికి, సుబ్బయ్యతోటలో నిన్న కరోనా పాజిటివ్గా నమోదైన కుటుంబంలో ఈ రోజు ఇంకో మహిళకు మొత్తం మీద ఈ రోజు ఇప్పటి వరకు ఐదు కరోనా పాజిటివ్ కేసులు చిలకలూరిపేట పట్టణంలో నమోదయ్యాయి. పట్టణంలో సుమారుగా రోజుకు ఐదారుకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
July 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు ఐదు కరోనా కేసులు నమోదు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

