728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 30, 2020

చిలకలూరిపేటలో కరోనా: లాక్ డౌన్ ముందు... లాక్ డౌన్ తర్వాత... లాక్ డౌన్ పొడిగింపు?

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు శాసన సభ్యురాలు సూచన మేరకు జిల్లా కలెక్టర్ చిలకలూరిపేటను వారం రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.

అయితే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 24వ తేదీ వరకు 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24వ తేది నుంచి 30వ తేదీ(7 రోజులు) వరకు 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణం, మండలాల వారీగా లాక్ డౌన్ ముందు... తరువాత నమోదైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి... 24వ తేదీకి ముందు చిలకలూరిపేట పట్టణంలో 147 కేసులు, నాదెండ్లలో 39, ఎడ్లపాడులో 39, రూరల్లో 20 కేసులు నమోదయ్యాయ.

24వ తేదీ తర్వాత 30వ తేదీ వరకు పట్టణంలో 325, నాదెండ్లలో 88, ఎడ్లపాడు 83, రూరల్ 73 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడు రోజుల్లో 324 పాజిటివ్ కేసులు నియోజకవర్గం మొత్తం మీద నమోదయ్యాయి. మొత్తం మీద మొదటి నుండి ఈరోజు వరకు 569 పాజిటివ్ కేసులు నియోజకవర్గస్థాయిలో నమోదయ్యాయి. అంటే ఏడు రోజుల్లో 324 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ పెట్టకపోతే ఈ కేసుల సంఖ్య మరింత విస్తృతంగా పెరిగేవని అనేక మంది భావిస్తున్నారు.

ఇప్పుడు వచ్చిన కేసులు అన్నీ 24కు ముందు ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వచ్చినవేనని అధికారులు భావిస్తున్నారు.  అయితే ఒక వారంలో 324 కేసులు నమోదు కావడంతో ఇంకా ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే 31వ తేదీ ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిత్యావసరాలు అయినా పాలు, కూరగాయలకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఒకటో తేదీ బక్రీద్ పండుగ కావడంతో ఉదయం 6 నుండి 11 గంటల వరకు అనుమతి ఇవ్వొచ్చని పలువురు భావిస్తున్నారు.

ఈనెల 1వ తేదీ బక్రీద్ పండుగ అనంతరం ఒక వారం రోజులు లాక్ డౌన్ పొడిగిస్తే ఉన్న పాజిటివ్ కేసులు టెస్టుల ద్వారా బయటకు వస్తాయని, లేకపోతే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకటో తేదీ నుండి చిలకలూరిపేటలో మరలా లాక్ డౌన్ ను పొడిగించే దిశగా అధికారులు ఆలోచించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కరోనా: లాక్ డౌన్ ముందు... లాక్ డౌన్ తర్వాత... లాక్ డౌన్ పొడిగింపు? Rating: 5 Reviewed By: NEWS UPDATE